వాయువ్య భారతానికి ‘నిలో ఫర్’ ముప్పు

భారత తూర్పుతీరాన్ని అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాను సృష్టించిన బీభత్సాన్ని మరువక ముందే..మరో తుఫాను ముంచుకొస్తోంది. పశ్చిమమధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. ఇది వాయవ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. ఈ తుఫాన్‌కు నిలోఫర్ అని నామకరణం చేశారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతంతోపాటు పాకిస్థాన్‌లోని తీరప్రాంతాలను ఈ తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నీలోఫర్ తుపాన్ గుజరాత్ లో ని నలియాకునైరుతి దిశగా 1240కిమీ దూరంలో అరేబియా సముద్రంలో కేంద్రీ కృతమైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. సోమవారానికి ఇది మరింత బలపడి పెనుతుపాన్ గా మారే అవకాశం ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది భారతదేశానికి పడమట ఉన్న అరేబియా సముద్రం నుంచి గుజరాత్‌ వైపునకు… గురువారం నాటికి ఇది కచ్‌ ప్రాంతంలో తీరం దాటే ముప్పు ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను ప్రభావంతో కొంకణ్‌ మీదుగా ద్రోణి ఏర్పడటం.. ఈశాన్య రుతుపవనాల ప్రవేశం.. ఏపీలోని ఉత్తర కోస్తాపై ఉపరితల ఆవర్తనం.. బంగాళాఖాతం వైపు నుంచి తెలంగాణ వరకూ ద్రోణి, తేమగాలులు.. ఈ కారణాలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు జోరందుకున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Leave a Comment