విమానంలో అత్యాచారయత్నం….

హవాయి నుంచి జపాన్ వెళ్తున్న విమానంలో ప్రయాణికురాలిపై అత్యాచారయత్నం జరిగింది. హవాయికి చెందిన మైఖేల్ టనోయె(29) అనే మతిస్థిమితం లేని వ్యక్తి జపాన్ కు  చెందిన ఓ ప్రయాణికురాలిని విమానం టేకాఫ్ తీసుకున్న దాదాపు రెండు గంటల తర్వాత బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అయితే ఆమె ఎలాగోలా బాత్రూంలో ఉన్న ఎమర్జెన్సీ బటన్ నొక్కారు. దాంతో విమాన సిబ్బంది తలుపు బలవంతంగా తీసే ప్రయత్నం చేశారు. అయితే అతడు తలుపులకు అడ్డంగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. చివరకు తలుపుకు ఉన్న స్క్రూలు విప్పదీసి తలుపు తీయగలిగారు. అయితే అతడి తల్లి మాత్రం టనోయె కు  మానసిక ఆరోగ్యం సరిగా లేదని, అందుకే మందులు వాడుతున్నామని చెప్పారు. ఈ సంఘటన తర్వాత బయటకు వచ్చిన అతడికి ఆమె టాబ్లెట్లు ఇవ్వగా, కొద్దిసేపటికే నిద్రలోకి జారిపోయాడు. తర్వాత విమానాన్ని వెనక్కి తిప్పగా, హొనొలులులో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

Leave a Comment