విశాఖ ఎయిర్ పోర్ట్ ను సిబ్బందే కాపాడారు….

హుదూద్  భీకర తపాను నుంచి విశాఖ ఎయిర్ పోర్టును  సిబ్బందే కాపాడారంటూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కొనియాడారు. సిబ్బంది అప్రమత్తత కారణంగానే విమానాశ్రయంలో ప్రాణనష్టం సంభవించలేదని అన్నారు. విమానాశ్రయంలోని కీలక వ్యవస్థలు దెబ్బతినలేదని చెప్పారు. విమాన శ్రయ సిబ్బంది అంకిత భావాన్ని మంత్రి  కొనియాడారు. రేపట్నుంచి విశాఖ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని అశోక్ వెల్లడించారు. నవంబర్ 1నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని చెప్పారు. విమానాశ్రయ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి విమానాశ్రయాన్ని పునరుద్ధరించారని తెలిపారు.

Leave a Comment