శంకర్ ‘ఐ’ తెలుగు టీజర్ విడుదల

విక్రమ్ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఐ’ మూవీ విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా ఈ మూవీ తెలుగు వర్షన్ టీజర్ గురువారం విడుదల అయింది. ఒక నిమిషంకు పైగా నిడివి ఉన్న ఈ టీజర్ లో విక్రమ్ యాక్షన్ ఎలా ఉంటుందో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ‘‘త్వరలో మిమ్మల్ని చూస్తా’’ అంటూ ఓ భయంకరమైన లుక్ తో విక్రమ్ గెటప్ సూపర్ గా ఉంది. ఈ టీజర్ చూసిన ఫ్యాన్స్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఆరాటంగా ఎదురుచూస్తున్నారు. తెలుగులో ఈ సినిమా పాటలు ఇంకా విడుదల కాలేదు. తమిళంలో విడుదల అయిన పాటలు, ట్రైలర్ దుమ్ములేపటంతో పాటు.., యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి. శంకర్ క్రియేషన్ గా చియాన్ విక్రమ్ నటించిన భారీ బడ్జెట్ సినిమా ‘ఐ’. భారీ సెట్టింగులు, విభిన్నమైన గెటప్ లతో హాలీవుడ్ రేంజ్ లో శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అమీ జాక్సన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మాతగా వ్యవహరించగా ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందించాడు.

Leave a Comment