శివ ద్వారా తెలుగు సినిమా చరిత్ర లో ఒక పేజీ తన పేరు రాసు కున్న వర్మ వంగ వీటి సినిమా ద్వారా మరల చరిత్ర సృష్టిస్తారా ?

శివ ద్వారా తెలుగు సినిమా చరిత్ర లో ఒక పేజీ తన పేరు రాసు కున్న వర్మ వంగ వీటి సినిమా ద్వారా మరల చరిత్ర సృష్టిస్తారా ? డిసెంబర్ 23 న తెలుస్తుంది.

శివ తరువాత గాయము , క్షణ క్షణము , గోవిందా గోవిందా ద్వారా తెలుగు సినిమా చరిత్ర లో పేరు నిలుపు కున్న వర్మ హిందీ లో కూడా అదే స్థాయిలో రంగీలా, కంపెనీ మరియు సర్కార్ ఆయనకి పేరు తెచ్చినా కూడా ఈ మధ్య ట్విట్టర్ ద్వారా చిరంజీవి , పవన్ కళ్యాణ్ అభిమానుల ను వైవిధ్య ప్రకటనల ద్వారా అందరి చేత విమర్శలు పొందుతున్న అతను  ఈ సినిమా ద్వారా ఏమి సందేశము ఇస్తారో ఆసక్తి తో అందరూ ఎదురు చూస్తున్నారు .

1970 నుంచి 1990 వరకు దాదాపు రెండు దశాబ్దములు కనక దుర్గమ్మ వారధి సాక్షి గా వ్యక్తి గత కక్షలు గా మొదలు అయినా తగాదాలు ,ఒక వర్గనాయకుడిని,  మరొక కులము అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసు కొనుట , రెండు కుటుంబాలు తగాదా గా మారటం , వారి అస్థిత్యము నిల బెట్టు కోవటానికి వేరు వేరు రాజి కీయ పార్టీ లో చేరటం , ఒక వీధి నుంచి మొదలు అయినా పోరాటం ఒక ప్రాంతము నుంచి రాష్ట్రము మొత్తము ఆందోళన గా మారటం  చిన్న పిల్ల వాడి నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికి తెలిసిన విజయవాడ రాజకీయము.

వంగ వీటి రంగ హత్య తరువాత , అప్పుడు రాష్ట్ర ముఖ్య మంత్రి గా ఉన్న ఎన్టీఆర్ రంగ కుటుంబమును చూడటానికి వెళ్ళటం ,సినిమా నటుడిగా అనుభవము ఉన్న ఎన్టీఆర్ కూడా నిజ జీవితములో ఆ టైం లోఇబ్బంది పడ్డారు అంటారు .

నిజ జీవితము లో జరిగిన ఈ బెజవాడ కథను వర్మ ఎలా మలుస్తారో చూడాలి.

ఒక విషయము గమనించాలి
ఈ రోజులు మానవ సంబంధాలు ఆర్ధిక సంబంధాలు మారి న రోజులు. కులం దాటి జాతి ని దాటి , గ్లోబల్ గా వివాహము లేక సహా జీవనము చేస్తున్న అమ్మాయి అబ్బాయి ఉన్న ఈ సమాజము లో కుల , వర్గ పోరాటం  సగటు ప్రేక్షకుడు ఎలా ఆదరిస్తాడో చూడాలి.

వంగవీటి సినిమా కు అభ్యంతరము వంగా వీటి రంగా కుటుంబము నుంచి వచ్చినది . దేవినేని వర్గము మాత్రమూ అభ్యంతరము పెట్ట లేదు.
ఒక్క టి మాత్రము నిజము
వర్మ రౌడీ రాజీకీయము , భార్య భర్త ల మధ్య ఉద్వేగ సన్నివేశాలు , అన్న తమ్ముడి మధ్య ఆవేశ సంభాషణలు , అంతకు మించి కధనం వెండి తెర మీద చూపించటం లో సిద్ద హస్తుడు .
ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టు కోవాలని ఆశిద్దాము.

శేఖర్ వేమూరి
ఆసియన్ లైట్ తెలుగు వార్త

Leave a Comment