శ్వేత బసు విడుదల వెనుక ఎం జరిగింది ?

వ్యభిచరిస్తూ పట్టుబడిన నటి శ్వేత బసు ప్రసాద్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పునరావాస కేంద్ర నుంచి శ్వేతా బసును వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. శ్వేతాబసును విడుదల చేయాలంటూ కొద్ది రోజుల క్రితం ఆమె తల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఓ హెటల్ లో వ్యభిచరిస్తూ పట్టుబడిన కేసులో శ్వేతాబసును అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆమె పునరావాస కేంద్రంలో వుంటుంది. శ్వేత బసు ను రెస్క్యూ హోమ్ నుంచి బయటకు రప్పించడానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని కధనాలు వచ్చిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు  ఆమె మూడు నెలల పాటు రెస్క్యూ హోమ్ లోనే ఉండాల్సి ఉంది. అయితే ఈ వ్యవది గడవకుండానే ఆమెను ఆక్కడి నుండి విడుదల చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, వీరు ఉన్నత స్థాయి చెందిన ప్రముముఖులని,తమ పలుకుబడి  ఉపయోగించి ఆమెను అక్కడి నుండి తప్పించడానికి ప్రత్నిస్తున్నారని కధనాలు వచ్చాయి. శ్వేతా అన్ని రోజులు  అక్కడే ఉంటే, తమ వ్యవహారాలు బయటకు వస్తాయనే భయంతోనే వారు ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారని మీడియాలో వినిపించింది. ఈ కధనాలు వచ్చిన వారంలోనే ఆమెకు కోర్టులో ఊరట లభించడం ఈ కధనాలకు బలం చేకుర్చుతుంది. తెర వెనుక జరిగిన ప్రయత్నాలు మేరకె శ్వేతకు ఊరట లభించిదనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Leave a Comment