హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వర్మ….

వివాదాల సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా హీరోలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజల నుంచి వందల కోట్లు తీసుకునే హీరోలు.. విశాఖపట్నం కోసం కేవలం కొన్ని లక్షలు మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. ఉచితంగా వస్తాయి కాబట్టే బోలెడంత ప్రేమ కురిపించి,ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా తుఫాను విషయంలో దేవుడి నిర్ణయాన్ని కూడా రాంగోపాల్ వర్మ కొంతవరకు ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులు దేవుడు సృష్టించేవే అయితే.. ఇలాంటి విధ్వంసం సృష్టించి దేవుడు ఎలా ఆనందం పొందుతాడని అన్నారు. విశాఖపట్నంలో ఉన్న అందరూ పాపం చేసినవాళ్లేనా.. వాళ్లను దేవుడు ఎందుకు శిక్షించాలనుకున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

Leave a Comment