హుధూద్ కోసం…టాలీవుడ్ క్రికెట్ మ్యాచ్

హుధూద్ తుఫాన్ బాధితులను ఆదుకోవడంలో భాగంగా నిధుల సేకరణకోసం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ నటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీ తెలిపారు. ఈ మ్యాచ్ నిర్వహణ ద్వారా వచ్చే ఆధాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియజేయనున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల్లో ఈ నెల 12న తీరం దాటిన హుధూద్ తుఫాన్ ఆయా జిల్లాల్లో తీవ్ర నష్టం కలిగించింది. పంటలకు తీవ్రంగా నష్టం కలిగించడంతో పాటు విత్యుత్, రవాణా, మంచినీరు, ఆహారం సరఫరా లాంటివి నిలిచి పోయాయి. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకుంది. తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులంతా భారీ విరాళాలతో ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ రూ. 50 లక్షలు, రామానాయుడు ఫ్యామిలీ రూ. 50 లక్షలు, కృష్ణ మహేష్ ఫ్యామిలీ రూ. 50 లక్షలు, తమిళ హీరోలైన సూర్య, కార్తి ఫ్యామి రూ. 50 లక్షలు, ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అర్జున్, రేణు దేశాయ్ రూ. 20 లక్షల చొప్పున, రామ్ చరణ్ 15 లక్షలు, నితిన్,రామ్, రవితేజ, సమంత లాంటి వారు 10 లక్షల చొప్పున. ఇలా టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా తమకు తోచిన విధంగా తుఫాన్ బాధితుల కోసం విరాళాలు అందించారు.

Leave a Comment