హెల్త్ కార్డుల జారీకి సీఎం అంగీకారం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన ఏపీఎన్జీవో ఉద్యోగులు హెల్త్ కార్డులపై చర్చించారు. కొన్ని నెలల కిందట హామీ ఇచ్చిన హెల్త్ కార్డులు ఇంతవరకు ఇవ్వకపోవడంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు వెంటనే స్పందించిన చంద్రబాబు, ఈ నెల 17న హెల్త్ కార్డుల జారీకి అంగీకరించినట్లు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మీడియాకు తెలిపారు. అంతేగాక రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలను తాత్కాలికంగా విజయవాడకు తరలించాలని చూస్తున్న అంశంపైన కూడా మాట్లాడామని, ఏ శాఖలను తరలిస్తారో స్పష్టం చేయాలని కోరినట్లు చెప్పారు.

Leave a Comment