అబ్బాయిగా మారిన 17 ఏళ్ల అమ్మాయి

71404644466_625x300 జార్ఖండ్ : మగవారిలో ఎక్కువగా ఆడవారి లక్షణాలు, ఆడవారిలో మగ లక్షణాలు  ఉండటం అరుదుగా జరుగుతుంటాయి. ఇలాంటి లక్షణాలు గల వారిని ఆడా లేక మగా అన్నది నిర్ధారించడంపై కూడా వివాదం ఏర్పడుతుంది. క్రోమోజోముల చర్యల్లో మార్పుల వల్లే ఈ విపరీత చర్యలు జరుగుతుంటాయని వైద్యులు చెబుతున్నారు.

తాజాగా జార్ఖండ్లోని బొకారో జిల్లాలో 17 ఏళ్ల అమ్మాయి అబ్బాయిగా మారాడు(మారింది)! ఆమె శరీరంలోని క్రోమోజోముల చర్యల్లో మార్పులే కారణం. అమ్మాయి అబ్బాయిగా పరివర్తన చెందడాన్ని వైద్యులు ధ్రువీకరించారు. అమ్మాయికి ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమెను పరీక్షించిన ముగ్గురు వైద్యులు.. అబ్బాయి పేరు ఆడవారి కేటగిరిలో నమోదు చేయించారేంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అతణ్ని పరీక్షించడం కోసం ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపారు. క్రోమోజోముల్లో మార్పుల వల్ల శరీరం విభిన్న ఆకృతిలో్కి పరివర్తన చెందుతోందని, దీనివల్ల అమ్మాయి అబ్బాయిగా మార్పుచెందుతాడని వైద్యులు తెలిపారు.

Leave a Comment