8 న చంద్ర గ్రహణం (మీన, మేష , సింహ , ధను , మీన రాశుల కి)

గ్రహణం అనగానే చాలా మంది భయపడతారు. గ్రహణం సంభవించినపడు విడుదల అయ్యే కిరణాలు ప్రభావం తో అనారోగ్య సమస్యలు వస్తాయని, మన పెద్దలు కొన్ని నియమాలు పెట్టారు. ఆ కిరణాలు ఎక్కడికైనా చొచ్చుకు పోతాయి కాబట్టి గ్రహణ సమయంలో వండటం, తినడం లాంటివి చేయకూడదు అంటారు.

మత్స్య పురాణం లో ని 251 వ అధ్యాయం ప్రకారం, దేవతలకు రక్షసులకు అమృతం కోసం సాగరాన్ని మధిస్తున్నప్పుడు ధన్వంతరి అమృతం తో ప్రత్యక్షం అవుతాడు. ఆ అమృతం తమకు కావలంటె తమకు కావాలాని మళ్ళీ దేవతలు రాఖసులు పోట్లాడుకుంటుంటారు. శ్రీ మహా విష్ణువు ఇది గమనించి అందమైన అప్సరస వేషం ధరించి అమృతాన్ని దేవతలకు, మామూలు నీరు రాక్షసులకు తన మాయ చే పంచుతుంటాడు.

స్వర్భాను అనే రాక్షసుడు ఈ మోసాన్ని గమనించి తాను కూడా దేవతల వేషం ధరించి అమృతాన్ని కొంత సేవిస్తాడు. ఇది గమనించిన సూర్య చంద్రులు శ్రీమహా విష్ణువు కు చెపుతారు. కోపోద్రిక్తుడు అయిన సుదర్శన చక్రం తో స్వర్భాను ను తలను ఖండిస్తాడు. అప్పటికే సగం అమృతం తాగి ఉన్న స్వర్భాను శిరస్సు, శరీరం రెండు గా విడి పోయి శిరస్సు రాహువు గాను మిగిలిన శరీరం కేతువుగాను ఏర్పడుతుంది.

స్వర్భాను పరిస్థితి కి సూర్య చంద్రులే కారణమని భావించిన స్వర్భాను సూర్య చంద్రులను మింగటానికి ప్రయత్నిస్తుంటాడు. దీనినే సూర్యగ్రహణం, చంద్ర గ్రహణం అంటారు.

గ్రహణం ఆశ్వీయుజ శుక్ల పూర్ణిమ బుధవారము అనగా 08 అక్టోబర్‌ 2014 రోజున రేవతీ నక్షత్రంలో మీనరాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది.
స్పర్శ కాలం మధ్యాహ్నం 02.44
మధ్య కాలం మధ్యాహ్నం 04.24
సూర్యాస్తమయం సాయంత్రం 05.56 (హైదరాబాద్ ప్రామాణికంగా)
మోక్షకాలం సాయంత్రం 06.05
నిత్యభోజన ప్రత్యాబ్దీకాలు `
సూర్యగ్రహేతు నాశ్నీయా త్పూర్వం యామ చతుష్టయమ్‌ ।
చన్ద్రగ్రహేతు యామాం స్త్రీన్‌ బాలవృద్ధాతురాన్వినా ॥
యామము అనగా 3 గంటలు . గ్రహణము జరిగే యామానికి ముందు 3 యామములు (అనగా 9గంటలు) పగలు భోజనము చేయకూడదు. నిత్యభోజనాదులు శుద్ధ బింబమునూ చూసిన తర్వత చేసుకోవాలి.
8న చంద్రగ్రహణం: ఏం చేయకూడదు?

గ్రహణ గోచారము
రేవతీ నక్షత్రమువారు ఈగ్రహణమును చూడరాదు.
వృషభ , మిథున , తుల , మకర రాశుల వారికి శుభ ఫలితము
కర్కాటక , కన్య , వృశ్చిక , కుంభ రాశుల వారికి మధ్యమ ఫలము
మేష , సింహ , ధను , మీన రాశుల వారికి అధమ ఫలము

పాటించవలసిన నియమాలు
శుభఫలము ఉన్న రాశివారు అనుష్ఠానాదికాలు చేసుకొనడానికి సరైన సమయంగా తెలుసుకోవాలి.
మధ్యమ ఫలము ఉన్నవారు మరియు అధమ ఫలము ఉన్నవారు శక్తికొద్దీ వస్త్ర,ధాన్య,శాకాది,దానాలు చేసుకోవాలి.
గ్రహణ కాలంవరకూ దేవతామూర్తుల మీద ,నిల్వఉండే ఊరగాయ, ధాన్యము, నీరు మొదలైన వాటిలో దర్భ వేసి`గ్రహణ అనంతరం తీసి వేయాలి . మరుసటి రోజు దేవతామందిరాన్ని ,దేవతా మూర్తులను శుద్ధపరచుకోవాలి.
గ్రహణసమయంలో దేవతా పూజలు అభిశేకాదులు చేయకూడదు .
ఉపదేశిత మంత్రము కానీ ఏదైనా దేవతానామాన్ని జపిస్తే గణనీయ ఫలము అని శాస్త్రవాక్యము.
గర్భవతులు గ్రహణం చూడరాదు.

Leave a Comment