80వేల మంది చిన్నారులకు విముక్తి ….

నోబెల్ పీస్ ప్రైజ్ అందుకుంటున్న ఏడో భారతీయుడు కైలాష్ సత్యర్ది కావడం విశేషం. బాలల హక్కుల కోసం ఈయన అలుపెరగని పోరాటం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ లోని విదిశ లో బచ్ పన్ బచావో ఆందోళన్ సంస్ధ ప్రారంభించి.. 1990 నుంచి సేవలు అందిస్తున్నారు. కైలాష్ సుమారు 80 వేల మంది చిన్నారులకు విముక్తి కల్పించారు. పలు అంతార్జాతీయ సంస్థలతో కలసి ఆయన పిల్లల హక్కుల కోసం పోరాడుతున్నారు. ఆయన సేవలకుగానూ ప్రపంచవ్యాప్తంగా పలు అవార్డులు వరించాయి. నోబెల్ శాంతి బహుమతికి ఎంపికవ్వడంపై కైలాస్ హర్షం వ్యక్తం చేశారు.

Leave a Comment