రోజుకో యాపిల్‌తో శృంగారోద్దీపన!!

51404903644_625x300లండన్ : ‘యాన్ యాపిల్ ఎ డే.. కీప్స్ ద డాక్టర్ ఎవే’ అని చిన్నప్పటి నుంచి వింటున్నాం కదూ. కానీ, ఇప్పుడు శాస్త్రవేత్తలు దాని గురించి కొత్త విషయాలు చెబుతున్నారు. రోజుకో యాపిల్ తింటే మహిళలకు శృంగార వాంఛలు పెరుగుతాయట.  ఆరోగ్యవంతంగా ఉన్న మహిళల్లో అయితే ఇలా కచ్చితంగా జరుగుతుందని పరిశోధకులు తేల్చిచెప్పారు. యాపిల్ పండ్లలో పోలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి జననంగాలకు రక్తసరఫరాను పెంచుతాయని, దానివల్ల కోరికలు పెరుగుతాయని అంటున్నారు.

ఇందుకోసం 18 నుంచి 43 సంవత్సరాల మధ్య వయసున్న 731 మంది ఆరోగ్యవంతులైన ఇటాలియన్ మహిళలను శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు. వీరికి ముందుగా ఫిమేల్ సెక్సువల్ ఫంక్షన్ ఇండెక్స్‌కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఇచ్చి, వాటికి సమాధానాలు తీసుకున్నారు. ఆ తర్వాత రోజుకు ఒకటి, రెండు యాపిల్ పండ్లు ప్రతిరోజూ ఇస్తూ మళ్లీ వారి కోరికల స్థాయిని పరిశీలించారు. అలా తిన్నవారికి కోరికలు బాగున్నాయని గుర్తించారు. హఫింగ్టన్ పోస్ట్‌లో ఈ కథనం ప్రచురితమైంది.

Leave a Comment