పిల్లా … నా బావనిస్తనే….

argentina“నాకిష్టమైన టీమ్ గెలిస్తే నగ్నంగా ఊరేగుతా,” “ఉగ్రవాదుల చెరనుంచి బాలికల్ని విడిపించేందుకు నన్ను నేను సమర్పించుకుంటా” వంటి బంపర్ ఆఫర్ల జాబితాలో ఇంకొకటి వచ్చి చేరింది. అర్జెంటీనా ప్రపంచకప్ గెలుచుకుంటే నా భర్తను వారం రోజుల పాటు పాప్ సింగర్ కి అరువు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది అర్జెంటీనా గోల్ కీపర్ సెర్జియో రోమెరో భార్య ఎలియానా గుయెర్సియో.
ఈ మేరకు ఆమె ఒక ట్వీట్ కూడా చేసింది. అసలు కథేమిటంటే సెమీఫైనల్ లో నెదర్లాండ్స్ ఆటగాళ్ల గోల్స్ను గోల్ కీపర్ రొమెరో సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ ఆట చూసిన పాప్ సింగర్ మనసు పారేసుకుని మెచ్చుకుంది. దాంతో అర్జెంటీనా గెలిస్తే నా భర్తను వారం పాటు అప్పిస్తానని ఎలియానా వాగ్దానం చేసేసింది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ గెలిస్తే ఎలియానా వాగ్దానం నిలబెట్టుకుంటుందా లేక “అమ్మో నా బావనిస్తనా” అనేస్తుందో చూడాలి.

Leave a Comment