‘బియాస్’ మృతుడు అఖిల్‌కు అంతిమ వీడ్కోలు

Akhilవందలాదిగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు
శోకసంద్రంగా మారిన గిర్మాజీపేట
ఎల్‌బీనగర్ శ్మశానవాటికలో ముగిసిన అంత్యక్రియలు

 
 వరంగల్ నగరంలోని గిర్మాజీపేట శోకసంద్రంగా మారింది. హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటనలో అఖిల్ మృతిచెందగా… అతడి భౌతికకాయం మంగళవారం నగరానికి చేరుకుంది.తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య సాయంత్రం అంత్యక్రియలు జరిగారుు.
 
 
వరంగల్ చౌరస్తా : తాము పడుతున్న కష్టాన్ని దిగమింగుతూ కుమారుడిని గొప్ప చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు కన్న కలులు కల్లలయ్యూరుు. నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్లిన కుమారుడు విగతజీవిగా మారి ఇంటికి చేరాడు. 16 రోజుల ఎదురు చూపుల తర్వాత ఇంటికి చేరిన అఖిల్ అంత్యక్రియలు అతడి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య మంగళవారం ముగిశారుు.

వరంగల్‌లోని 21వ డివిజన్‌లోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతులకు కూతురు మౌనిక, కుమారుడు అఖిల్ ఉన్నారు. హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్న అఖిల్ ఈనెల 3న స్టడీ టూర్ కోసం తోటి విద్యార్థులో కలిసి వెళ్లాడు. ఈ నెల 8న ిహ మాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఫొటోలు దిగుతుండగా డ్యాం గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా వచ్చిన నీళ్లలో అఖిల్‌తో సహా 24 మంది విద్యార్థులు కొట్టుకుపోరుున విషయం తెలిసిందే. రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టిన 15 రోజుల తర్వాత అఖిల్ మృతదేహం లభించింది. సోమవారం అదేరాష్ట్రంలోని మండి జిల్లా కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి రోడ్డుమార్గంలో ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి ఉదయం 11.50 గంటలకు చేరుకుంది. అక్కడే ఉన్న వరంగల్ ఆర్డీఓ మధు, తహసీల్దార్ రవి అఖిల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బంధువులకు అప్పగించారు. అంబులెన్స్‌లో సాయంత్రం 4.15 గంటలకు గిర్మాజీపేటలోని ఇంటికి మృతదేహం చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బోరున విలపిస్తూ అంబులెన్స్ వద్దకు వెళ్లారు. వారి రోదనలతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో నిండిపోరుుంది. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారంతా అఖిల్‌ను కడసారి చూపు చూసుకోవాలని ఆతృతగా చూసినప్పటికీ వారికి నిరాశే మిగిలింది. మృతదేహం 15 రోజులపాటు  నీళ్లలో ఉండటంతో దుర్వాసన రాకుండా పూర్తిగా ప్యాక్ చేసి, బాక్సులో పెట్టారు. దీంతో శవపేటికపై కప్పిన అఖిల్ ఫ్లెక్సీ వద్ద నివాళులు అర్పించారు. అప్పటికే బంధువులు, స్నేహితులు, స్థానికలు, నాయకులు వందలాదిగా అక్కడికి చేరుకున్నారు. అఖిల్ తల్లిదండ్రులు మిట్టపల్లి సంజయ్, సునీత , అక్క మౌనిక, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

జేసీ, అర్బన్ ఎస్పీ, ఇతర అధికారుల నివాళి

అఖిల్ మృతదేహం వద్ద జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు, డీఆర్వో సురేంద్రకరణ్, ఆర్డీఓ మధు, తహసీల్దార్ మధు నివాళులు అర్పించారు. పుష్ఫగుచ్చాలను శవపేటికపై పెట్టారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారితోపాటు వరంగల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టి.రమేష్‌బాబు, కాంగ్రెస్ నాయకురాలు డాక్టర్ హరిరమాదేవి, వైద్యురాలు ప్రమీల, బీజేపీ అర్బన్ అధ్యక్షుడు చింతాకుల సునీల్ నాయకులు, బాకం హరి శంకర్, ఎరుకల రఘునారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకుడు బండి కుమారస్వామి, చిన్న గోపి తదితరులు అఖిల్ భాతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
 
బర్త్‌డే డ్రెస్ శవపేటికపై కప్పి అంతిమయూత్ర..

ఈ సారి బర్త్‌డేను తన ఫ్రెండ్స్‌తో జరుపుకుంటానని చెప్పి తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకుని కొత్తదుస్తులు కొనుక్కొని పయనమైన అఖిల్ బర్త్‌డే చేసుకోకముందే కానరాని లోకాలకు చేరాడు. ఆ దుస్తులు అతడు ప్రయూణించిన బస్సులోనే ఉండిపోయూరుు. కళాశాల తరఫున వచ్చిన ముగ్గురు ప్రతినిధులు అఖిల్ కుటుంబ సభ్యులకు అతడి బ్యాగ్‌ను అప్పగించారు. అతడి బర్త్‌డే దుస్తులను శవపేటికపై కప్పి అంతిమయూత్ర నిర్వహించారు. అంత్యక్రియలకు ముందు సంప్రదాయబద్ధంగా జిల్లేడుచెట్టుకు పెళ్లి చేసి అక్షింతలు వేశారు.

Leave a Comment