‘ఆర్టీసీ విభజన ప్రక్రియను త్వరలో పూర్తి చేస్తాం’

J. Poornachandra Rao-RTCహైదరాబాద్: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)లో విభజన ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని ఆ సంస్థ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు. ఇప్పటికీ విభజన ప్రక్రియ కొనసాగుతుందున్నారు. శుక్రవారం ఆర్టీసీ భవన్లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ… ఆర్టీసీ ఆస్తుల పంపకంపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే జూలై 1 వ తేదీన ఆర్టీసీ నిపుణుల కమిటీ సమావేశం కానుందని ఆయన స్పష్టం చేశారు.
 
ఆ కమిటీ ఇచ్చే నివేదికను త్వరలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేస్తామన్నారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఆర్టీసీని విభజన జరుగుతుందని ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు వెల్లడించారు.   
 

Leave a Comment