ఆగష్టు నెలాఖరుకల్లా రాజధాని ఖరారు: చంద్రబాబు

Babuవిజయవాడ: ఆగష్టు నెలాఖరుకల్లా ఏపీ రాజధానిని ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. రాజధానిని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారనే విషయమై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఏపి రాజధాని ప్రాంతాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ ఆగష్టులో నివేదిక ఇస్తుంది. ఆ తరువాత వారం పది రోజులలో రాజధాని ప్రాంతాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో జీతాలివ్వడానికే డబ్బులేదని చంద్రబాబు నాయుడు చెప్పారు. భవిష్యత్తులో రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆదాయం వచ్చే ప్రాంతాన్ని తెలంగాణకు ఇచ్చార బాధపడ్డారు. త్వరలో మచిలీపట్నంలో పోర్టు నిర్మిస్తామని ఆయన చెప్పారు.

Leave a Comment