ఇకముందు అలా చేయకండి!

81404678317_625x300గోపాల సుబ్రమణ్యం’ వ్యవహారంలో ప్రభుత్వానికి సీజేఐ లేఖ
 
న్యూఢిల్లీ: గోపాల సుబ్రమణ్యం వ్యవహారంలో మోడీ సర్కారు తీరుపై బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేయడానికన్నా ఒకరోజు ముందే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్రభుత్వానికి ఘాటుగాలేఖ రాశారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, మాజీ సొలిసిటర్ జనరల్ సుబ్రమణ్యంను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలన్న తమ సిఫారసును తిప్పిపంపడంపై ప్రభుత్వంపై జస్టిస్ లోధా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ ముందురోజే.. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాసిన ఒక లేఖలో.. ‘నాకు తెలియకుండా, నా అంగీకారం లేకుండా ప్రతిపాదిత వ్యక్తుల్లోంచి ఒక పేరును తొలగించడాన్ని నేను ఆమోదించను. భవిష్యత్తులో కార్యనిర్వాహక వ్యవస్థ ఇలాంటి ఏకపక్ష విధానాలను అవలంబించకూడదు’ అని లోధా పేర్కొన్నారు.

Leave a Comment