పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

51405375482_625x300బెంగళూరు: ఉద్యానవన నగరంగా పేరుపొందిన బెంగళూరు  అత్యాచారాల విషయంలో  ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని మించిపోతోంది. ఇక్కడ కూడా ఢిల్లీలో మాదిరి అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. కామాంధులు కొందరు ఓ పీజీ విద్యార్థిని (22)పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.   ఓ విద్యార్థిని  స్థానిక ఫ్రేజర్ టౌన్‌లో తను నివాసం ఉండే అపార్ట్‌మెంట్‌ వద్ద  శుక్రవారం రాత్రి  తన స్నేహితుడితో మాట్లాడుతూ ఉంది. అదే సమయంలో స్కోడా కారులో ఆరుగురు ఆగంతకులు అక్కడికి చేరుకున్నారు.  యువతిని వారు బలవంతంగా  కారులోకి  లాగారు. ఆమెతో పాటు స్నేహితుడిని కూడా కారులో ఎక్కించుకువెళ్లారు.

కాక్స్‌టౌన్ సమీపంలోని రైలు పట్టాల దగ్గర కారు ఆపారు.  స్నేహితుడిని బెదిరించి,  యువతి మీద నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  స్నేహితుడు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లాడు. ఆమె కోలుకున్న తరువాత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కారులోనే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  రైలు పట్టాల దగ్గరకు తీసుకు వెళ్లి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది.  సోమవారం రాత్రి ఫ్రేజర్‌టౌన్ సమీపంలో స్కోడా కారును గుర్తించిన యువతి స్నేహితుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు.  నిందితులలో ఒకడైన  హైదర్ నజీర్‌ను అరెస్టు చేశారు.  పులకేశి నగర పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment