కౌన్సిలర్ జానీని తీసుకువచ్చిన గోవా పోలీసులు

41404568057_625x300 (1): వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో అదృశ్యమైన కౌన్సిలర్  మహమ్మద్‌జానీ గోవా పోలీసులు ఈ రోజు కడప కోర్టులో ప్రవేశపెట్టారు. మునిసిపల్ చైర్మన్ పదవి వైఎస్ఆర్ సిపికి దక్కకుండా చేసేందుకు టిడిపి కౌన్సిలర్లు, నేతలు  జమ్మలమడుగులో నానా బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.  తననెవ్వరూ కిడ్నాప్ చేయలేదని కౌన్సిలర్ జానీ గురువారం సాయంత్రమే ప్రిసైడింగ్ అధికారి, ఆర్డీఓ రఘునాథ రెడ్డికి స్వయంగా ఫోన్ చేశారు. శుక్రవారం ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం మాట్లాడారు. ఆమేరకు స్పందించిన ఎన్నికల సంఘం 22 మంది సభ్యులకు, 21మంది హాజరైనందున జమ్మలమడుగు చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలను తుంగలో తొక్కారు.

 కౌన్సిలర్ జానీని ఈరోజు గోవా పోలీసులు ఇక్కడకు తీసుకువచ్చారు. విచారణ అనంతరం  కోర్టు  అతనిని బంధువులకు అప్పజెప్పింది. తననెవరూ కిడ్నాప్ చేయలేదని  జానీ మరోసారి స్పష్టం చేశారు. సమావేశం జరుగుతుందని తెలియక తాను టూరు వెళ్లినట్లు చెప్పారు.

Leave a Comment