మళ్లీ కెమిస్ట్రీ పండుతుందా?

71404327052_625x300హృతిక్ రోషన్ సినిమా వచ్చి చాలా కాలమైంది. ఓ పక్క భార్యతో విడాకులు, మరోపక్క స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా హృతిక్  కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. 2013 నవంబర్‌లో ‘క్రిష్ 3’ వచ్చింది. ఆ తర్వాత ఆయన కమిట్ అయిన సినిమా ‘బాంగ్ బాంగ్’. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ సోమవారం విడులైంది. ఈ ప్రచార చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. ‘జిందగీ నా మిలేగీ దొబారా’ తర్వాత హృతిక్, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఇది.

ఆ చిత్రంలో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ ప్రచార చిత్రంలో కూడా మంచి కెమిస్ట్రీ కనిపిస్తోందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకి రావడానికి కారణంగా నిలిచేవాటిలో ప్రచార చిత్రాలకు ప్రధాన స్థానమే ఉంటుంది. ఆ పరంగా చూసుకుంటే ఈ ప్రచార చిత్రం వందకు వంద మార్కులు కొట్టేసింది. ఫలితంగా చిత్రంపై భారీ అంచనాలు ఆరంభమయ్యాయి. అక్టోబర్‌లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి.. అంచనాలను ఏ మేరకు నిజం చేస్తుందో వేచి చూడాల్సిందే!

Leave a Comment