లాంగ్‌లాంగ్.. లోలాంగ్..

81404684653_625x300భారీ మొసలిని బంధించి, తరలిస్తున్న మగధీరుల్లా కనిపిస్తున్నారా మీకు వీరంతా.. అయితే, వీరికంత సీన్ లేదు లెండి.. ఎందుకంటే.. ఇది నిజమైన మొసలి కాదు కాబట్టి.. ఇదో రోబో. చూడ్డానికి అచ్చంగా నిజమైన మొసలిని తలపిస్తూ.. దానిలాగే కదిలే ఈ రోబో మొసలి పేరు ‘లాంగ్‌లాంగ్’. పొడవు 21 అడుగులు.. దీన్ని రూ.లక్షకు పైగా ఖర్చు పెట్టి తయారుచేశారు. శనివారం లాంగ్‌లాంగ్‌ను ఫిలిప్పీన్స్‌లోని పాసే సిటీలో ఉన్న మొసళ్ల పార్కుకు తరలిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇదీ.

పార్కులో బోలెడన్ని ఒరిజినల్ మొసళ్లు ఉండగా.. ఈ డూప్లికేట్‌ను ఎందుకు తయారుచేయడం అని ప్రశ్నిస్తే.. ఇది నిజంగా ఒకప్పుడు కింగ్‌లా బతికిన ఓ భారీ మొసలి తాలూకు డూప్లికేటే అని చెప్పాల్సి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఉప్పునీటి మొసలిగా(జూలో ఉన్నది) పేరొందిన ‘లోలాంగ్’ ఫిలిప్పీన్స్‌లోనే ఉండేది. గతేడాది అది చనిపోయింది. దీంతో దాని ప్లేసులో దీన్ని రీప్లేస్ చేస్తున్నారన్నమాట.

Leave a Comment