‘నేను డర్టీ పిక్చర్ లాంటి సినిమాలు చేయలేను’

kareena kapoorముంబై: బాలీవుడ్ లో హీరోయిన్లలో తనకంటూ ఒక ప్రత్యేకస్థానం కల్పించుకున్న నటి కరీనా కపూర్. ప్రస్తుతం కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ నటి.. తనకు పారితోషికం విషయంలో ఇప్పటివరకూ ఎటువంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేసింది. సినిమా రెమ్యూనిరేషన్ విషయంలో విద్యాబాలన్, ప్రియాంక చోప్రాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుండగా.. కరీనా మాత్రం ఆ అంశానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపింది.’నాకు ఇప్పటి వరకూ పారితోషికం తీసుకోవడంలో ఎటువంటి సమస్యలు తలెత్తలేదు.ఇక అటువంటప్పుడు ఫిర్యాదులు ఏముంటాయి.’అంటూ ప్రశ్నించింది. ఒక్కోసారి భారీ బడ్జెట్ చిత్రాలు తీసేటప్పుడు చేసే పాత్రలను బట్టి కూడా పారితోషకం నిర్ణయించడం జరుగుతుందని కరీనా తెలిపింది. అయితే తాను డర్టీ పిక్చర్స్ లాంటి సినిమాలను చేయలేనని పేర్కొంది. ఆ తరహా సినిమాలు చేసే ధైర్యం తనకు లేదని కరీనా తెలిపింది. తనకు గోల్ మాల్ -3 లాంటి సినిమాలు చేయడం ఒక ఛాలెంజ్ గా పేర్కొంది.
 
2012 లో జరిగిన ఓ కార్యక్రమంలో హీరో-హీరోయిన్లకు సమానమైన పారితోషకం ఉండాలని కోరిన కరీనా ఇప్పుడు మాటమార్చింది.  2011లో వచ్చిన డర్టీ పిక్చర్స్ జాతీయ అవార్డు గెలుచుకున్న సందర్భంలో హీరోయిన్లకు కూడా హీరోలతో సమానమైన పారితోషికం ఉండాలని కరీనా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Leave a Comment