సచిన్ టెండూల్కర్ ఎవరో నాకు తెలియదు

2సచిన్ టెండూల్కర్.. క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లని పేరు. సామాన్యుల నుంచి సినీ తారలు, బడా వ్యాపారవేత్తుల, రాజకీయ నాయకులు, ఇతర క్రీడా దిగ్గజాలు సైతం మాస్టర్ అభిమానుల జాబితాలో ఉన్నారు. పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్, టెన్నిస్ కెరటం ఫెదరర్ల ఫేవరేట్ క్రికెటర్ సచినే. అయితే రష్యా టెన్నిస్ అందాల భామ మరియా షరపోవాకు సచిన్ అంటే ఎవరో తెలియదట! సచిన్ ఎవరు అంటూ ప్రశ్నించింది.

సచిన్ తీరికున్నప్పుడల్లా వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ పోటీలను తిలకిస్తుంటాడు. ఈసారి కూడా భార్య అంజలితో కలసి లండన్ వెళ్లాడు. శనివారం ఇంగ్లండ్ ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్, గోల్పఱ్ ఇయాన్ పౌల్డర్, ఇంగ్లండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ తదితరులతో కలసి సచిన్ రాయల్ బాక్స్‌లో దర్శనమిచ్చాడు. మ్యాచ్ అనంతరం వీరి పేర్లు ప్రస్తావనకు వచ్చినపుడు సచిన్ గురించి తెలుసా అంటూ ఓ విలేఖరి షరపోవాను అడిగాడు. ‘నాకు తెలియదు. సచిన్ టెండూల్కర్’ అంటూ సమాధానమిచ్చింది. అయితే ఫుట్‌బాలర్ బెక్‌హామ్ తనకు పరిచయమంటూ షరపోవా చెప్పింది.

Leave a Comment