అలసిపోయా.. అందుకే చెయ్యట్లేదు: శిల్పా

Shilpa Shuklaలేహ్ : అనురాగ్ కశ్యప్ లాంటి దర్శకుడి నుంచి ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ, ఓ నటి మాత్రం తాను నటించలేను.. వద్దనేసింది. చక్ దే ఇండియా, ఖామోష్ పానీ లాంటి చిత్రాల్లో నటించి.. మంచి పేరు సంపాదించుకున్న శిల్పా శుక్లా కేవలం విశ్రాంతి కోసం ‘గ్యాంగ్స్ ఆఫ్ వాసీపూర్’ సినిమాలో నటించనని తెగేసి చెప్పింది. తాను బాగా అలసిపోయానని, బెనారస్కు వెళ్లి అక్కడ కొంతకాలం పాటు ఉన్నానని, కొన్నాళ్ల పాటు విశ్రాంతి కావాలనే తాను సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపింది.

ఇప్పటికే తాను ఒప్పుకొన్న ‘కఫిన్ మేకర్’ చిత్రాన్ని పూర్తి చేయడానికే తిరిగి వచ్చానని శిల్పా (32) చెప్పింది. వరుసపెట్టి సీరియస్ పాత్రలు చేసిన తర్వాత.. ఇప్పుడు కాస్త విశ్రాంతి తీసుకోవాలని ఆమె భావిస్తోంది. ఇప్పుడు తాను వరుసగా రెండు కామెడీ చిత్రాల్లో నటిస్తున్నానని, దాంతో ఇప్పటివరకు ఉన్న ఇమేజ్ మారుతుందని అంటోంది. మరోవైపు లడఖ్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని కూడా ఆమె ఆస్వాదించింది. అక్కడ ప్రదర్శించే ఇరానీ చిత్రాలను చూడాలని భావిస్తున్నట్లు తెలిపింది.

Leave a Comment