నేను క్వీన్ కాదు

నేను క్వీన్ కాదు

నేను క్వీన్ కాదంటున్నారు క్రేజీ నటి సమంత. దక్షిణాది (తమిళం, తెలుగు)లో సూపర్ హీరోయిన్‌గా ప్రకాశిస్తున్న సమంత చేతిలో ప్రస్తుం ఏడు చిత్రాలున్నాయి. వాటిలో నాలుగు చిత్రాలు తమిళం కావడం విశేషం. చాలామంది హీరోయిన్ల మాదిరిగానే ఈసుందరిపై కూడా రకరకాల పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. యువ నటుడు సిద్ధార్థ్‌తో షికార్లు లాంటి వదంతులు ప్రచారం అయినా అవేవీ సమంత కెరీర్‌పై ప్రభావం చూపకపోవడం విశేషం.
 
స్టార్స్ ముఖ్యం కాదు : ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న వన్నీ స్టార్ హీరోల చిత్రాలే. అయినా తనకు స్టార్స్ ముఖ్యం కాదంటున్నారు సమంత. స్టార్ హీరోలను చూసి తానెప్పుడూ చిత్రాలను అంగీకరించలేదని, దర్శకుడు ఆయన పనితనం చూసే చిత్రాలు ఒప్పుకుంటానన్నారు.  దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ అంటే వీరాభిమానం అని చెప్పారు. ఎలాంటి కమర్షియల్ చిత్రం అందులో ఆయన హీరోయిన్లకు ప్రాముఖ్యతనిస్తారని కితాబిచ్చారు.

ఈ అమ్మడు నటించిన తెలుగు చిత్రం ఆటోనగర్ సూర్య గత వారం విడుదలైంది. ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ తన తెలుగు కెరీర్ నాగచైతన్యతో మొదలైందన్నారు. ఆయనకు జంటగా నటించిన మూడవ చిత్రం ఆటో నగర్ సూర్య మొత్తానికి విడుదలయ్యిందన్నారు. ఈ చిత్ర దర్శకుడు దేవకట్టా తన తదుపరి చిత్రంలో పూర్తి నిడివిగల పాత్రలో నటించే అవకాశం ఇస్తానన్నారని తెలిపారు.
 
అవన్నీ రూమర్సే: టాలీవుడ్ చిత్రం అల్లుడు శ్రీనులో నవ నటుడుడికి జంటగా నటించడానికి రెండు కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు జరుగుతున్న ప్రచారం గురించి సమంత స్పందిస్తూ అవన్నీ వదంతులేనని స్పష్టం చేశారు. నిజానికి తాను అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ చిత్ర నిర్మాత బెల్లం కొండ సురేష్ చాలా సాయం చేశారని తెలిపారు.

ఆ సమయంలోనే అల్లుడు శ్రీను చిత్రం చేయడానికి అంగీకరించానని వెల్లడించారు. అలాగే బాలీవుడ్ సెన్సేషనల్ చిత్రం క్వీన్ దక్షిణాది భాషల్లో హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం అవుతున్న వార్తల్లోనూ నిజంలేదని సమంత స్పష్టం చేశారు. ఈ చిత్రంలో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుం దని, దీంతో దర్శక, నిర్మాతలను కన్విన్స్ చేయలేమని అందువలన క్వీన్ రీమేక్ యువరాణిని తాను కాదని సమంత తన ట్విట్టర్‌లోను స్పష్టంగా పోస్టు చేశారు.

Leave a Comment