మళ్లీ సచిన్ వెర్సెస్ షేన్ వార్న్

61404541344_625x300లండన్ : సచిన్ టెండూల్కర్ మళ్లీ హెల్మెట్ పెట్టుకుని, ప్యాడ్లు కట్టుకుని.. తనదైన శైలిలో బ్యాట్ ఊపుకుంటూ క్రీజులోకి వస్తాడు. అవతలివైపు నుంచి షేన్ వార్న్.. తనకే సొంతమైన లెగ్ స్పిన్‌తో మాయాజాలం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఏంటి.. ఇదంతా గతం అనుకుంటున్నారా? కాదు.. శనివారం నాడే క్రికెట్‌కు మక్కాగా పేరొందిన లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో అలనాటి యోధులతో పాటు ప్రస్తుతం కూడా క్రికెట్ ఆడుతున్న తరం కలిసి ప్రేక్షకులకు 100 ఓవర్ల పండుగ చేయనున్నారు. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, షేన్ వార్న్ సారథ్యంలోని రెస్టాఫ్ ద వరల్డ్-11 శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి తలపడున్నాయి.

ముత్తయ్య మురళీధరన్, వెస్టిండీస్ బ్యాటింగ్ వీరుడు బ్రయాన్ లారా, భారత జట్టులో ద వాల్ రాహుల్ ద్రావిడ్.. వీళ్లంతా క్రికెట్ ప్రేమికులకు కనువిందు చేయనున్నారు. ఇటీవలి కాలంలో వరుసగా టి20 మ్యాచ్‌లు చూస్తూ అలసిపోయిన జనానికి మళ్లీ 50 ఓవర్ల మ్యాచ్‌తో పసందుగా విందు భోజనం అందించేందుకు క్రికెటర్లందరూ సిద్ధమైపోయారు. యాషెస్ టూర్ తర్వాత అత్యంత బాధాకరమైన పరిస్థితిలో క్రికెట్‌ను వీడిన కెవిన్ పీటర్సన్ కూడా మరోసారి ఈ మ్యాచ్‌లోనే ఆడబోతున్నారు.

ఎంసీసీ జట్టు: సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), రాహుల్ ద్రావిడ్, శివనారాయణ్ చందర్‌పాల్, ఆరన్ ఫించ్, బ్రయాన్ లారా, క్రిస్ రీడ్ (వికెట్ కీపర్), బ్రెట్ లీ, ఉమర్ గుల్, సయీద్ అజ్మల్, షౌన్ టైట్, డేనియల్ వెట్టోరి

రెస్టాఫ్ ద వరల్డ్: షేన్ వార్న్ (కెప్టెన్), వీరేంద్ర సెహ్వాగ్, షాహిద్ అఫ్రీదీ, పాల్ కాలింగ్‌వుడ్, టినో బెస్ట్, యువరాజ్ సింగ్, ముత్తయ్య మురళీధరన్, పీటర్ సిడిల్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ (వికెట్ కీపర్), కెవిన్ పీటర్సన్, తమీమ్ ఇక్బాల్

Leave a Comment