‘విజయవాడ-గుంటూరులో భూముల ధరలకు రెక్కలు’

41392325642_625x300హైదరాబాద్‌: నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రాయలసీమ రాజధాని సాధన సమితి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కంపెనీలు వచ్చాకే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని అన్నారు. విశాఖ కూడా స్టీల్‌ ప్లాంట్ వచ్చాకే అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు.

మూడు ప్రాంతాల్లో అత్యధికంగా వెనుకబడింది రాయలసీమేనని చెప్పారు. ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. విజయవాడ-గుంటూరులో ఇప్పటికే భూముల రేట్లు ఆకాశానంటుతున్నాయని తెలిపారు. రాజధాని ఇక్కడే ఏర్పాటు చేస్తారని ప్రచారం చేస్తూ పంటపొలాలను కూడా రియల్టర్లు వెంచర్లుగా మారుస్తున్నారని ఆరోపించారు. అక్కడ రాజధాని నిర్మించాలంటే రూ.కోట్లు పెట్టి ప్రభుత్వం భూములు కొనాలని, దానికి బదులు రాయలసీమలో రాజధాని నిర్మాణం చేపడితే బాగుంటుందని లక్ష్మణ్ రెడ్డి సూచించారు.

Leave a Comment