గ్యాస్ సిలిండర్ ధర రూ. 250 చొప్పున పెంపు?

51404252017_625x300న్యూఢిల్లీ : ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? అయితే.. మళ్లీ కట్టెలు కొనుక్కుని దాన్ని వెలిగించడం మొదలుపెట్టండి. ఎందుకంటే.. గ్యాస్ సిలిండర్ ధరను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని కేంద్ర చమురు మంత్రిత్వశాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ దృష్టికి చమురు మంత్రిత్వశాఖ తీసుకెళ్లనుంది. కిరోసిన్, గ్యాస్ సిలిండర్ల ధరలను నిపుణుల కమిటీ సూచించిన మేరకు పెంచాలని ఈ శాఖ భావిస్తోంది.

గతంలో కిరీట్ పారిఖ్ కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు కిరోసిన్‌ను లీటరుకు రూ. 4-5 చొప్పున, గ్యాస్ సిలిండర్లను సిలిండర్‌కు రూ. 250 చొప్పున పెంచాలని చమురు మంత్రిత్వ శాఖ ప్రతిపాదిస్తోంది. ఈ విషయాన్నే కేబినెట్ కమిటీకి నివేదిస్తోంది. ఇక నెలకు డీజిల్ ధరలను 40-50 పైసల వంతున పెంచాలన్న నిర్ణయాన్ని కొనసాగించాలని కూడా ఈ శాఖ భావిస్తోంది. కేబినెట్ ఆమోదం తెలిపితే చాలు.. ఇక సిలిండర్ల మీద భారీ వడ్డన తప్పకపోవచ్చు. ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుడికి ఇది పెనుభారంగానే పరిణమిస్తుంది

Leave a Comment