నిర్వహణ లోపం వల్లే ‘గెయిల్’ పేలుడు

gail pipeline burstతూర్పు గోదావరి జిల్లా శుక్రవారం జరిగిన గెయిల్ పైపులైన్ పేలుడుకు గల కారణాలను ఆంధ్ర విశ్వివిద్యాలయం ప్రొఫెసర్ సీవీ రామన్ విశ్లేషించారు. పైపులైన్ల నిర్వహణ, ప్రమదాలు జరగడానికి గల కారణాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

డెల్టాలో చమురు తవ్వకాల వల్ల జరిగిన ప్రమాదం కాదు. ఇది కేవలం నిర్వహణలోపం వల్లే జరిగింది. పైపులైనును ఎప్పటికప్పుడు మార్చుకుంటే ఈ తరహా ప్రమాదాలను నివారించవచ్చు. ప్రమాదసంకేతాలను ముందుగా గుర్తించకపోవడం వల్ల, సమన్వయ లోపం వల్ల ఇలా జరిగింది. గెయిల్ అధికారుల దగ్గర్నుంచి స్థానిక పంచాయతీ సర్పంచి వరకు అందరి మధ్య సమన్వయం ఉండాలి.

పైపులైన్ మీద ఎప్పుడూ విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటాయి. అందువల్ల ప్రతి మూడు నెలలకు ఒకసారి వీటిని సాంకేతిక నిపుణులు పరిశీలించాలి. ఐదు, పదేళ్లకోసారి మాత్రమే చూస్తే లోపాలు కూడా సరిగ్గా తెలియవు. పాతికేళ్ల నాటి పైపులు అంటే.. వాటి జాయింట్ల వద్ద పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.

Leave a Comment