టీచర్‌పై అత్యాచారం.. వీడియో తీసిన విద్యార్థులు

71403379985_625x300: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు మరింత క్షీణించిపోతున్నాయి. మతఘర్షణలతో అట్టుడికిన ముజఫర్ నగర్ జిల్లాలో మరో దిగ్భ్రాంతికర సంఘటన వెలుగు చూసింది. శనివారం సాయంత్రం బల్వాఖేరి గ్రామంలో 23 ఏళ్ల మహిళా టీచర్‌పై అత్యాచారం జరిగింది. ఓ వ్యక్తి బలత్కారం చేయగా, బ్లాక్ మెయిల్ చేయడం కోసం మరో ఇద్దరు దుండగులు సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. ఈ విషయాన్ని బయటకు చెపితే అంతుచూస్తామని ఆమెను బెదిరించారు. నిందితులు ముగ్గురూ కాలేజీ విద్యార్థులు.

బాధితురాలు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ‘ట్యూషన్ చెప్పి ఇంటికి వెళ్తుండగా మోహిత్ నా వెనుకవైపు వచ్చి నోరు మూశాడు. దీంతో అరవలేకపోయాను. అతను నన్ను బలవంతంగా ఖాలీ ఇంట్లోకి తీసుకెళ్లాడు. మరో ఇద్దరి ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి రమ్మన్నాడు. నాపై అత్యాచారం చేస్తుండగా, మరో ఇద్దరూ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించారు’ అని చెప్పింది. టీచర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. రెండు వారాల క్రితం ముజఫర్ నగర్లోనే ఓ మహిళపై ఎనిమిది మంది అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించి వాట్స్ యాప్‌లో ఉంచిన కేసు నమోదైంది.

Leave a Comment