నా జీవితం ‘రియాల్టీ షో’గా మారిపోయింది

ranbir kapoorముంబై: ‘నా జీవితం పుకార్లతో నిండిపోయింది. ఆ పుకార్లతో నా కెరీర్ తలకిందులవుతున్నట్లు అనిపిస్తోంది. నా జీవితం ఒక రియాల్టీ షో మాదిరిగా తయారైంది’ అంటూ బాలీవుడ్ అగ్రశ్రేణి నటుల్లో ఒకరైన రణ్‌బీర్ కపూర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అటు అందంతో పాటు నటనలో కూడా..తల్లిదండ్రులే గాడ్‌ఫాదర్ పాత్ర పోషిస్తుండడంతో బాలీవుడ్‌లో అతగాడికి దేనికీ కొదవలేకుండా పోయింది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని తనలోని ప్రతిభను కూడా చాటిచెప్పాడు ఈ యువ నటుడు. అయితే రణ్‌బీర్ మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నిన్నమొన్నటిదాకా బాగానే ఉన్నా ఇటీవల తనపై వస్తున్న పుకార్లతో జీవితం తలకిందులవుతున్నట్లు అనిపిస్తోందంటున్నాడు. పుకార్లు తన జీవితాన్ని ‘రియాల్టీ షో’గా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
 
తనపై వస్తున్న పుకార్లను చూసి తన తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని, ఈ వయసులో వారినలా చూస్తుండడం తనకు కూడా ఎంతో బాధగా ఉందంటున్నాడు. ‘తల్లిదండ్రులతో రణ్‌బీర్ గొడవపడటంతో తండ్రి రిషీ కపూర్.. రణ్‌బీర్‌ను ఇంట్లోనుంచి వెళ్లగొట్టాడని, ఆ క్రమంలోనే ఇంట్లోనుంచి వెళ్లిపోయాడని రకరకాల కథనాలు మీడియాలో ప్రసారమవుతున్నాయి. మరికొందరైతే కత్రినాతో కలిసి వెళ్లిపోతున్నాడని కూడా కథనాలు కూడా వస్తున్నాయి. ఆమెతో వెళ్లిపోవడానికి నేనెవర్ని? నాకింకా పెళ్లి కాలేదు. అలాంటిదేదైనా ఉంటే నేరుగా మీడియా ముందుకు వచ్చి నేనే చెబుతాను. అప్పటిదాకా ఇలాంటి పనులను మానుకుంటే మంచిద’న్నాడు. అనురాగ్ కశ్యప్ చిత్రం ‘బాంబే వెల్వెట్’ సినిమాలో కత్రినా కైఫ్ తో కలిసి రణ్ బీర్ నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుని..జగ్గా జానూస్ చిత్రంలో నటిస్తున్నాడు.

Leave a Comment