మీ చుట్టూ ఏముందో చెబుతుంది..

61404587810_625x300మీరెక్కడికైనా వెళితే ఆ ప్రాంతంలో, ఆ సమయంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీకు సమీపంలో మీకు అవసరమైన హోటల్‌లు, ఇతర షాపింగ్ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలని ఉందా? అయితే సరికొత్త యాప్.. ‘యెటి’ని మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిందే! ఒకే రకమైన హాబీలు, అభిప్రాయాలు ఉన్నవారిని ఒక్కచోటికి చేర్చే ‘ఎట్ ద పూల్’ వెబ్‌సైట్ యాజమాన్యం ఈ సరికొత్త యాప్‌ను రూపొందించింది.

‘యెటి’ ద్వారా మీ తరహా హాబీలున్నవారితో అభిప్రాయాలు పంచుకోవచ్చు. మీరు ఏ ప్రాంతానికి వెళ్లినా.. అక్కడ ఉండే మీ స్నేహితుల వివరాలను ఈ యాప్ చూపిస్తుంది. అంతేకాదు అక్కడ మీకు రెస్టారెంట్‌లు, పెట్రోల్ బంకులు, షాపింగ్ కేంద్రాలు, సినిమా హాళ్లు వంటి అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ ‘యెటి’ని ప్రస్తుతం యాపిల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చని, ఆండ్రాయిడ్ వెర్షన్‌ను త్వరలోనే విడుదల చేస్తామని ఎట్ ద పూల్ ప్రతినిధి డేవిడ్ జిమ్మర్‌మాన్ తెలిపారు.

Leave a Comment