ఒక కుటుంబానికి ఒక్క రుణమాఫీయే

41403502403_625x300హైదరాబాద్ : ఒక కుటుంబానికి ఒక రుణమాఫీయే వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రైతుల రుణమాఫీపై తాము వెనక్కి వెళ్లలేదని ఆయన చెప్పారు. అయితే, రైతులకు మేలు చేయాల్సిన బాధ్యత రిజర్వు బ్యాంకు మీద కూడా ఉందని అన్నారు.

ఆంధ్రప్రదేశ్లో రైతు రుణాల రీషెడ్యూలుపై రిజర్వు బ్యాంకు ఒకటి రెండు రోజుల్లో ఆదేశాలిస్తుందని భావిస్తున్నామని, ఒకవేళ అక్కడినుంచి అలాంటి ఆదేశాలు రాకపోతే.. రిజర్వు బ్యాంకు గవర్నర్తో మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడతారని ఆయన తెలిపారు. రీషెడ్యూల్‌పై ఆదేశాలిచ్చిన తర్వాతే కోటయ్య కమిటీ నివేదిక ఇస్తుందని వివరించారు. ఈ ఏడాది వ్యవసాయ ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెడతామని వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు.

Leave a Comment