లక్ష దాటిన అమరనాథ్ యాత్రికుల సంఖ్య!

61374231201_625x300శ్రీనగర్: పవిత్ర అమరనాథ్ ఆలయంలో మంచుతో సహజసిద్ధంగా ఏర్పడే శివలింగాన్ని దర్శించుకునేందుకు చేరుకున్న భక్తుల సంఖ్య లక్షకు చేరింది. జూన్ 28 తేదిన ఆరంభమైన అమరనాథ్ యాత్రలో ఇప్పటి వరకు 1,12,143 మంది దర్శించుకున్నట్టు ఆలయ అధికారి తెలిపారు. ఆదివారం రోజును రికార్డు స్థాయిలో 18994 మంది దర్శించుకుని ప్రార్ధనలు చేశారు.
వాతావరణ పరిస్థితులు మెరుగుపడటంతో బల్తాల్, చంద్రన్వరి నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు దర్శించుకున్నారు. అయితే ఈ యాత్రలో గుండె పోటుతో మరణించిన వారి సంఖ్య 12కు చేరింది. ఆదివారం రోజున చెన్నైకి చెందిన ఇద్దరు భక్తులు కే. రేణుక(67), జే ఆర్ముగమ్ (61)లు గుండె పోటుతో మరణించారని పోలీసులు తెలిపారు.

Leave a Comment