మా మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి!

ఇదేదో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌లకు సంబంధించిన వార్త అనుకుంటే, పప్పులో కాలేసినట్టే. దర్శకుడు కరణ్ జోహార్ గురించి కరీనా చేసిన కామెంట్ ఇది. ‘శుద్ధి’ చిత్రం ఆగిపోవడానికి కరణ్, కరీనాల మధ్య నెలకొన్న విభేదాలే కారణమని వస్తున్న రూమర్లను కరీనా ఖండించింది. కరణ్ తనకు సోదరుడిలాంటి వాడని, తాము తరచుగా కలుసుకుం71404243606_625x300టూనే ఉన్నామని, తమ మధ్య స్నేహ సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయని కరీనా చెప్పారు. ‘‘అనారోగ్యం కారణంగా హృతిక్ రోషన్ ‘శుద్ధి’ నుంచి తప్పుకున్నారు. ఆతర్వాత రణ్‌వీర్, దీపికా పదుకునేలను కరణ్ సంప్రదించారు. వాళ్లిద్దరూ ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రంతో బిజీగా ఉండటంతో ‘శుద్ధి’ ప్రాజెక్ట్ అటకెక్కింది’’ అని కరీనా అసలు విషయాన్ని వెల్లడించారు.

Leave a Comment