రాహుల్ బజ్జున్నాడు..!

41404941250_625x300న్యూఢిల్లీ: లోక్‌సభలో ధరల పెరుగుదలపై వాడివేడిగా చర్చ జరుగుతున్న సమయంలో.. జోలపాట వింటున్నట్లుగా, తలను కుడిపక్క వాల్చేసి, హాయిగా నిద్రపోతూ కనిపించారు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ పాపులరైపోయింది. పాలనాసక్తి లేదంటూ సొంత పార్టీ నేతలనుంచే విమర్శలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ తార.. ఈ ఫొటోతో ప్రజా సమస్యల పట్ల కూడా ఆసక్తి లేదని నిరూపించుకున్నారు.

‘ధరల పెరుగుదల విషయంలో గత పదేళ్లుగా కాంగ్రెస్ నిద్రపోతోంది. ఇప్పుడు అదే అంశంపై చర్చ జరుగుతుండగా ఆ పార్టీ యువరాజు నిద్రపోయారు’ అంటూ బీజేపీ వ్యంగ్యాస్త్రాలు విసిరింది. అయితే, కామన్‌గానే ఈ విమర్శలను కాంగ్రెస్ ఖండించింది. ప్రభుత్వ కక్షసాధింపు చర్యల్లో ఇదీ భాగమేనని పేర్కొంది.

Leave a Comment