రజనీ పుట్టిన రోజున లింగా రిలీజ్

raసూపర్‌స్టార్ రజనీకాంత్ పుట్టినరోజున లింగా చిత్రం తెరపైకి రానుందన్నది తాజా వార్త. కోచ్చడయాన్ తరువాత రజని నటిస్తున్న చిత్రం లింగా. చరిత్ర కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఆయన సరసన అందాలభామలు అనుష్క, సోనాక్షి సిన్హా నటిస్తున్న విషయం తెలిసిందే. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల విడు దలైన సూపర్‌స్టార్ చిత్రం కోచ్చడయాన్   అభిమానులను పూర్తి సంతృప్తి పరచలేక పోయింది. లింగా చిత్రం ముత్తు, పడయప్ప చిత్రాల తరహాలో పూర్తి కమర్షియల్ చిత్రంగా రూపొందబోతుందని యూనిట్ వర్గాల మాట కాగా, ఈ లింగా చిత్రాన్ని రజనీకాంత్ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 12న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Leave a Comment