పదో వికెట్టుకు ఇంగ్లండ్ రికార్డు భాగస్వామ్యం

englandనాటింగ్ హమ్:భారత్ తో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. పదో వికెట్టు కు 198 పరుగుల భాగస్వామ్యాన్నినెలకొల్పిన ఇంగ్లండ్ టెస్టు క్రికెట్ లో అరుదైన ఘనతను దక్కించుకుంది. నాల్గో రోజు 9 వికెట్ల నష్టానికి 352 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ చివరి వికెట్టుకు అత్యధిక పరుగుల రికార్డు నమోదు చేసి భారత బౌలర్లకు షాకిచ్చింది. మూడో 298 పరుగుల వద్ద 9 వికెట్టును కోల్పోయిన ఇంగ్లండ్ ను మిడిల్ ఆర్డర్ ఆటగాడు రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. చివరి వరుస ఆటగాడు అండర్ సన్ అతనికి చక్కటి సహకారం అందించడంతో ఇంగ్లండ్ 496 పరుగులకు ఆలౌటయ్యింది. రూట్ (154*), అండర్ సన్ (81) పరుగులతో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ ఆశలకు గండికొట్టారు.
 
మిడిలార్డర్ తడబడినా… చివరి వరుస బ్యాట్స్‌మెన్ తలా కొన్ని పరుగులు జత చేయడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ పుంజుకుంది. ఓ ఎండ్‌లో రూట్ గోడలా నిలబడటంతో… భారత పేసర్లు రాణించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది.  నిర్జీవమైన పిచ్‌పై భారత బౌలర్లు రాణించినా… ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జోయ్ రూట్ మాత్రం కొరకరాని కొయ్యగా మారాడు. నాల్గో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేద్దామనుకున్న టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. మూడు కీలక భాగస్వామ్యాలు నమోదు చేసి ఆతిథ్య జట్టు కోలుకునేలా చేశాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లతో ఆకట్టుకోగా, ఇషాంత్ శర్మకు మూడు వికెట్లు ,మహ్మద్ సమీకి రెండు వికెట్లు లభించాయి. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో 457 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్ కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది.

Leave a Comment