ఏమాయ చేస్తున్నావే.. సమంత

61404938489_Unknownసిటీలో ఆకసమంత.. అందం:  సమంత.. అందం, అభినయం ఆమె సొంతం. సకె్‌‌సస్ రేట్‌లో సమంత సూపర్‌హిట్. వెండితెరపై ఫుల్ మార్కులు కొట్టేసిన ఈ పుత్తడిబొమ్మ.. ఇప్పుడు ట్రెండ్ ఫాలో కావట్లేదు. ట్రెండ్ సెట్ చేస్తోంది. ఏదైనా ఈవెంట్‌కి హైదరాబాద్ వస్తే చాలు.. డిఫరెంట్ లుక్కుతో అదరగొడుతోంది. ఓసారి శారీ     గౌన్‌లో నయగారాలు కురిపిస్తే.. ఇంకోసారి షరారాలో మెరిసిపోయింది, మరోసారి లెహంగా హంగులతో ఆకట్టుకుంది. ఇలా ఒక్కో ఈవెంట్‌కి ఒక్కో స్టైల్‌తో సెలబ్రిటీలు అందరిలోనూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న ఈ బబ్లీ గాళ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫ్యాషన్. బాలీవుడ్ తారలు ఎంతమంది సిటీ ఈవెంట్లలో మెరిసినా, వాళ్లలో ఎవరికీ రానంత ఫ్యాషన్ ఇమేజ్ సమంత సొంతం చేసుకుంది.
 
స్టైలిస్ట్ ఇంటర్వ్యూ: అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా, అల్లుడుశ్రీను… ఇలా సమంతతో రెగ్యులర్‌గా వర్క్ చేస్తున్న స్టైలిస్ట్ కోన నీరజ.. సాక్షి సిటీప్లస్ తరఫున జర్నలిస్ట్‌గా అవతారమెత్తి.. సమంతను ఇంటర్వ్యూ చేశారు. టాప్ స్టైలిస్ట్ ప్రశ్నలకు.. స్టైల్ క్వీన్ స్పందించిన తీరిది.
 
 హైదరాబాద్‌లోని మేజర్ ఈవెంట్స్‌లో..   నీ స్టైల్‌తో టాక్ ఆఫ్ ది సిటీ అవుతున్నావ్. ఏంటీ  కథ?
 ఎటువంటి డ్రెస్ అయినా మన ఆత్మవిశ్వాసం పెంచేలా ఉండాలి. వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని చదివేయొచ్చు. అందుకే కాన్ఫిడెంట్‌గా డ్రెసప్ అవ్వాలనే మెసేజ్ నా ద్వారా అమ్మాయిలకి వెళ్లాలనుకుంటున్నా.
 డ్రెస్సింగ్‌లో ప్రయోగాలు చేయడం ఇష్టమా?
 అవును. సినిమాల్లో.. సమంత ఈ క్యారెక్టర్ చేయలేదు.. అని అంటే, ఎలాగైనా అలాంటి క్యారెక్టర్ చేసి నిరూపించుకోవాలని అనిపిస్తుంది. అలాగే బయటికి వేసుకునే డ్రెస్‌లో కూడా నేను ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడతా. అంతే తప్ప వార్డ్‌రోబ్‌లో నుంచి ఏదో ఒకటిలే అనుకుని తీసేసి వేసుకుని వెళ్లిపోవాలని అనుకోను.
 ఒక ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడానికి స్టైల్ పరంగా ప్లానింగ్ ఎలా?
 ఏముంది? అప్పటిదాకా ట్రై చేయని లుక్ గురించి నీతో.. సారీ (నవ్వులు) నా స్టైలిస్ట్ నీరజతో డిస్కస్ చేయడం, ఒక షేప్ అనుకోవడం.. దాని ప్రకారం ఫాలో అయిపోవడం.. అంతే!
 ఈ వెరైటీ లుక్స్ గురించి కామెంట్స్…
 చాలామంది బావుందంటున్నారు. కొంత మంది ‘ఎక్కువ కష్టపడుతోంది’ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేస్తున్నారు. పర్లేదు. ఏదైనా సరే గుడ్, బ్యాడ్ రెండూ ఉంటాయి.
 సిటీ  ఈవెంట్లకు అంత శ్ర ద్ధగా తయారవ్వడం అవసరమా?
 ముంబైలో జరిగే ఈవెంట్స్‌లో బాలీవుడ్ తారలు సినిమాలకు దీటుగా మెరుస్తారు. ఇక్కడెందుకు మనవాళ్లు అలా కనపడరా.. అని చాలాసార్లు అనుకునేదాన్ని. లాస్ట్ ఇయర్ ఫిల్మ్‌ఫేర్ ఫంక్షన్ కోసం పూర్తి శ్రద్ధ పెట్టి స్పెషల్‌లుక్‌తో అటెండయ్యాను. దానికి నేషనల్ స్థాయిలో వెబ్‌సైట్ల నుంచి వచ్చిన పొగడ్తలు న న్ను ఇన్‌స్పైర్ చేశాయి. అప్పటి నుంచి ప్రతి ఈవెంట్‌కి డిఫరెంట్‌గా డ్రెసప్ అవుతున్నా.
 ఫ్యాషన్‌పై ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచీ ఉందా?
  బాగా. కాలేజ్ డేస్‌లో ఎన్నో బ్రాండ్స్ కొనాలనుకున్నా. పొజిషన్ లేక ఊరుకున్నా.. అప్పట్లో హాలీవుడ్ హీరోయిన్ ఆడ్రీ హెప్‌బర్న్ లుక్స్ ఇష్టపడేదాన్ని.
 నీకంటూ నప్పనివి ఏమైనా ఉన్నాయనుకుంటున్నావా?
 ఊ… హెవీ జ్యూవెలరీ నప్పదు. అలాగే అతిగా ఎక్స్‌పోజ్ చేసే దుస్తులు సరిపడవు. నాది బేసిగ్గా సాఫ్ట్‌లుక్. అందుకే అలాంటి స్టైల్సే మ్యాచ్ అవుతాయి.
 ఇంకా… నీ డ్రెస్సింగ్ ద్వారా ఇంకేం చెప్పాలని?
 స్టైలిస్ట్‌వి.. జర్నలిస్ట్‌గా బాగానే సెట్టయిపోయావే (నవ్వులు). స్టైల్ అంటే ఒళ్లు చూపడం కాదు. మన లుక్ మనమేంటో చెబుతుంది. మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది. అది అమ్మాయిలు గుర్తుంచుకోవాలి.
 సెలబ్రిటీగా నీ స్టైల్స్ అమ్మాయిల మీద  ఇంపాక్ట్ చూపిస్తాయంటావా?
 తప్పకుండా.  సినిమాలలో పాత్ర పరంగా ఏవి, ఎలా ధరించినా అది వేరే. అయితే బయట మాత్రం మా డ్రెస్సింగ్ స్టైల్స్ యూత్‌ని ఇన్‌స్పైర్ చేస్తాయని నేననుకుంటున్నా.
  సిల్వర్ స్క్రీన్‌పై సోయగాలతో మతిపోగొట్టే సమంత.. ఇక్కడి ఈవెంట్లలో ఫాలో అవుతున్న డ్రెస్సింగ్ స్టైల్ ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్. మొన్నటి ఫిల్మ్‌ఫేర్ నుంచి తాజా ఫిల్మ్‌ఫేర్ వరకు.. పాల్గొన్న ప్రైవేట్ ఫంక్షన్లన్నీ సమంత ఫ్యాషన్ పరేడ్‌కు వేదికల్లా మారాయి. సిటీ ఈవెంట్ అంటే కాస్త ఇంపుగా, సొంపుగా ఉన్న డ్రెస్సయితే చాల్లే అనుకునే తారలకు భిన్నంగా.. ఈ తారక తళుక్కుమంటోంది. లక్షలు విలువ చేసే బ్రాండెడ్, డిజైనర్ దుస్తులతో ప్రత్యక్షమవుతోంది. డిజైనర్ ఎగ్జిబిషన్లు, ఆడియో ఫంక్షన్లు, తదితర కార్యక్రమాల్లో సమంత లుక్‌ని పింక్‌విల్లా వంటి టాప్‌క్లాస్ ఫ్యాషన్ వెబ్‌సైట్లు పొగిడాయి. వెండి తెరపై కిర్రాకు పుట్టిస్తున్న సమంత ఏదైనా ఈవెంట్‌కు వెళ్తే మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకుంటుంది. యాక్టింగ్‌లో నేటితరం మేటిగా నిలిచిన ఈ బ్యూటీ.. ఆహార్యంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంటుంది. మన డ్రెసప్‌ను బట్టి మనమేంటో తెలుస్తుందంటూ.. ఫ్యాషన్ వేరింగ్‌పై కాస్త స్పెషల్ కేర్ పెట్టాలని డిసైడైంది. ఎప్పుడైతే ఆమె మైండ్‌లో అలా ఫిక్సయిందో.. ప్రతి ఈవెంట్‌లోనూ ఆమెకే టాప్‌చైర్ దక్కుతోంది.

Leave a Comment