సానియా బెస్ట్ ర్యాంకు

41404762166_625x300డబుల్స్‌లో తొలిసారి టాప్-5లోకి
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా.. కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం విడుదల చేసిన డబ్ల్యూటీఏ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో సానియా ఐదో ర్యాంకుతో తొలిసారి టాప్-5లో చోటు దక్కించుకుంది. తాజాగా ముగిసిన వింబుల్డన్‌లో కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి ఆడిన సానియా రెండో రౌండ్‌లోనే ఓడినా.. కీలకమైన130 ర్యాంకింగ్ పాయింట్లు పొంది తొలి ఐదుగురి జాబితాలో స్థానం సంపాదించింది.

Leave a Comment