అడుగేస్తే.. దద్దరిల్లాల్సిందే!

61404943360_625x300యానిమేటర్ టీవీ సిరీస్‌లోని హీరో పాత్ర ‘గండము రోబో’ భవనమెత్తు విగ్రహమిది. ఈ యానిమేషన్ పాత్రను సృష్టించి 30 ఏళ్లయిన సందర్భంగా టోక్యోలో 2009లో దీనిని ఏర్పాటు చేశారు. అయితే 2019లో గండము రోబోకు 40 ఏళ్లు పూర్తి కావడం, ఆ మరుసటేడాది టోక్యోలో ఒలింపిక్ క్రీడలు జరగనున్న నేపథ్యంలో.. ఈ రోబోను నిజంగానే తయారు చేస్తున్నామని బుధవారం జపనీస్ యానిమేటర్లు, ఇంజనీర్లు ప్రకటించారు. 18 మీటర్ల ఎత్తై గండముతో టోక్యో వీధుల్లో వీరవిహారం చేయిస్తామని వెల్లడించారు.

ఇంతవరకూ విగ్రహం రూపంలో లైట్‌బల్బులు వెలుగుతుంటే, వింత శబ్దాలు చేస్తూ తలను మాత్రమే కదిలించిన గండము ఇకపై చేతిలో ఆయుధం పట్టుకుని నడుస్తూ సందర్శకులకు కనువిందు చేయనుందని చెబుతున్నారు. ఇంకేం..  ఇది నడుస్తుంటే సైన్స్ ఫిక్షన్ సినిమా కళ్లముందు కనిపిస్తుందన్నమాట!

Leave a Comment