ఉంటానో… ఊడిపోతానో!

Siddaramaiahఆత్మావలోకన సభలో సీఎం సిద్ధు
జాతీయ నాయకత్వంపై మాజీ ఎంపీ విశ్వనాథ్ మండిపాటు
బెంగళూరు : తన పదవీ కాలంపై కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అనుమానాలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై రెండోరోజు జరిగిన సమీక్ష సమావేశంలో తన అనుమానాలను ఆయన బహిర్గతం చేశారు. త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటిస్తూ వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమన్నారు. తాను ఐదేళ్లు ఈ పదవీలో ఉంటానో లేదో తెలియదని, అయితే పార్టీ మాత్రం అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎంపీ హెచ్.విశ్వనాథ్ మాట్లాడుతూ… జాతీయ నాయకత్వంపై నిప్పులు చెరిగారు. నాయకత్వ లక్షణాలు ఏ మాత్రం లేని రాహుల్ గాంధీ వైఖరి వల్లనే దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఓటమిని మూటగట్టుకుందని విమర్శించారు. ఏఐసీసీ ఉపాధ్యక్ష స్థానానికి రాహుల్ తగిన వ్యక్తి కాదని తేల్చి చెప్పారు. ఆ స్థానంలో ప్రియాంక గాంధీని తీసుకురావాలని సూచించారు. ఈ అభిప్రాయంతో చాలా మంది సీనియర్లు ఏకీభవించారు. ఇదే సమయంలో చాలా మంది మంత్రి వర్గ విస్తరణ, నామినేట్ పోస్టుల నియామకం జాప్యంపై నాయకులను నిలదీశారు. పదేళ్ల తర్వాత
 
 ఉంటానో… ఊడిపోతానో!
 
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా కొందరికి మాత్రమే ఫలాలు దక్కుతున్నాయని, పార్టీ కోసం శ్రమించిన వారికి నిర్లక్ష్యమే ఎదురవుతోందని అసహనం వ్యక్తం చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పరమేశ్వర్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంలో కార్యకర్తలు రెండు గ్రూపులుగా విడిపోయి తీవ్ర వాగ్వాదం చేశారు. ఆఖరుకు పరమేశ్వర, సిద్ధరామయ్య జోక్యం చేసుకుని పరిస్థితిని చక్యదిద్దాల్సి వచ్చింది.
 
ఇద్దరూ కారణమే..
 
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు సీఎంతో ఆపటు తాను కారణమేనంటూ కేపీసీసీ చీఫ్ పరమేశ్వర్ అన్నారు. అయితే పార్టీ ఓటమికి కొందరి వైఖరే కారణమంటూ ఫిర్యాదులు అందాయని అన్నారు. విపక్ష నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొనడం, తాము సూచించిన వారికి టికెట్ రాలేదన్న అక్కసుతో ప్రచారంలో పాల్గొనకుండా తటస్థంగా ఉండిపోయిన వారిపై క్రమశిక్షణ కమిటీకు నివేదిక అందించినట్లు తెలిపారు. కమిటీ సూచనలు అనపుసరించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో పేర్కొన్న వాగ్ధానాల్లో వంద వరకు పూర్తి చేసినట్లు వివరించారు.

Leave a Comment