శ్రీలంక అద్భుత విజయం

srilankaఇంగ్లండ్‌పై 1-0తో సిరీస్ కైవసం
 హెడింగ్లీ: ఇంగ్లండ్-శ్రీలంకల రెండో టెస్టుకు ఉత్కంఠభరిత ముగింపు లభించింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఓటమి దిశగా వెళ్లిన ఇంగ్లండ్ ఒక దశలో 228/9 స్కోరు వద్ద నిలిచింది… చివరి రోజు మరో 20.2 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఈ దశలో కెరీర్‌లో తొలి సెంచరీ చేసిన మొయిన్ అలీ (281 బంతుల్లో 108 నాటౌట్; 17 ఫోర్లు), అండర్సన్ (55 బంతుల్లో 0) ప్రతీ బంతికి పోరాడుతూ మ్యాచ్‌ను ‘డ్రా’ కు అతి చేరువగా తెచ్చారు.
 
 మరో రెండు బంతులు ఆడగలిగితే గత టెస్టులో శ్రీలంక తరహాలో ఈ సారి ఇంగ్లండ్ మ్యాచ్‌ను కాపాడుకునేది. అయితే ఎరాంగ వేసిన ఆఖరి ఓవర్ ఐదో బంతికి క్యాచ్ ఇచ్చి అండర్సన్ అవుటయ్యాడు. దాంతో ఒక్కసారిగా లంక శిబిరంలో ఆనందం… ఇంగ్లండ్ ఆటగాళ్ళలో నిర్వేదం. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 249 పరుగులకు ఆలౌట్ కావడంతో, లంక 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకుంది.

Leave a Comment