రైలు చార్జీల పెంపుపై ధర్నా

dharnaవేలూరు: కేంద్ర ప్రభుత్వం రైలు చార్జీలనుపెంచడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు వేలూరు ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జ్ఞానశేఖరన్ మాట్లాడుతూ ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన నెల రోజుల్లోనే రైలు చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపడం అన్యామన్నారు. రైలు చార్జీలు పెరగడంతో నిత్యవసర సరుకుల ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు.

అలాగే డీజిల్, గ్యాస్ ధరలను నెలనెలా పెంచుతామని ప్రకటించడం సరికాదని ఈ ప్రకటనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెంచిన రైలు చార్జీలను తగ్గించకుంటే దేశ వ్యాప్తంగా వివిధ పార్టీల నేతల ఆధ్వర్యంలో పోరాటాలు తప్పవని హెచ్చరించారు. ధర్నాలో కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీనివాసగాంధీ, రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయణి, వేలూరు యూనియన్ మాజీ అధ్యక్షులు దేవేంద్రన్, కౌన్సిలర్ కోదండపాణి పాల్గొన్నారు.
 
కాట్పాడిలో: కాట్పాడి చిత్తూరు బస్టాండ్ వద్ద పుదియ తమిళగం పార్టీ ఆధ్వర్యంలో రైలు చార్జీల పెంపునకు నిరసనగా ధర్నా నిర్వహించారు. పెంచిన రైలు చార్జీల ను వెంటనే త గ్గించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఆ పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి జయశీలన్, కార్పొరేషన్ కార్యదర్శి లూర్ద్‌స్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Comment