అమూల్యమైన ఉస్తాద్ సరోద్ వాయిద్యం గల్లంతు!

Ustad Amjad Ali Khanన్యూఢిల్లీ: గత 45 సంవత్సరాలు ప్రాణంలా చూసుకుంటున్న సరోద్ వాయిద్యం విమాన ప్రయాణంలో గల్లంతు కావడంపై ప్రముఖ సంగీత వాద్యకారుడు ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.  బ్రిటీష్ ఎయిర్ వేస్ లో లండన నుంచి ఢిల్లీ ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విశ్వకవి రవీంద్రనాధ్ టాగోర్ స్మారకార్ధం జూన్ 21 తేదిన లండన్ లోని డార్టింగ్ టన్ కాలేజి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోనేందుకు తన భార్య సుభాలక్ష్మితో కలిసి పాల్గోన్నారు.
జూన్ 28 తేదిన బ్రిటీష్ ఎయిర్ వేస్ విమానంలో లండన్ నుంచి ఢిల్లీకి తిరుగు  ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ ప్రయాణమయ్యారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత తన తనకు ఎంతో ఇష్టమైన, అమూల్యమైన సరోద్ వాయిద్యం కనిపించకుండా పోయిందని, విమాన సిబ్బంది సోదాలు నిర్వహిస్తుండగా సుమారు ఐదు గంటలపాటు వేచి ఉన్నాం. అయితే మరో విమానంలో రావొచ్చని అధికారులు తెలిపారు అని ఉస్తాద్ అమ్జద్ ఆలీ ఖాన్ తెలిపారు.
ఇప్పటికి 48 గంటలు దాటినా ఎలాంటి సమాచారం లేదన్నారు. లండన్ లో సరోద్ వాయిద్యాన్ని అప్పగించటప్పుడే ..’ఇది నా జీవితం. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి’ అని మరీ చెప్పానని, ఎంతో పేరున్న బ్రిటీష్ ఎయిర్ వేస్ బాధ్యతారాహిత్యంపై ఉస్తాద్ ఆలీ ఖాన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను ఫిర్యాదు చేశానని.. అయితే తనకు ఎలాంటి పరిహారం అక్కర్లేదని, వాయిద్యాన్ని అప్పగిస్తే చాలని ఉస్తాద్ అన్నారు.

Leave a Comment