రష్యా సన్నద్ధం

Vladimir Putinమనాగువా: పశ్చిమ దేశాలతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో లాటన్ అమెరికా దేశాల్లో తన ప్రాబల్యం తిరిగి పెంచుకునేందుకు రష్యా సన్నద్ధమైంది. మిత్రదేశమైన క్యూబాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లదిమీర్ పుతిన్ నికరాగువాలో ఆకస్మిక పర్యటన జరిపారు. లాటిన్ అమెరికాలో తలపెట్టిన ఆరు రోజుల పర్యటనలో భాగంగా పుతిన్ అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలను కూడా చట్టిరానున్నారు. బ్రిక్స్ దేశాల కూటమి (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల కూటమి) బ్రెజిల్‌లో జరగనున్న శిఖరాగ్ర సదస్సుకు హాజరుకానున్నారు.

 ఉక్రెయిన్ సంక్షోభం అనంతరం అమెరికాతో, రష్యా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న తరుణంలో వివిధ దేశాలతో సంబంధాలు పెంచుకునే అజెండాతో పుతిన్ ఈ పర్యటన చేపట్టారు. నికరాగువు రాజధాని మనాగువా చేరుకున్న పుతిన్‌కు ప్రెసిడెంట్ డేనియల్ ఆర్టెగా సతీసమేతంగా, ఆర్మీ చీఫ్‌తో కలసి ఘనస్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు నికరాగువాకు రావడం ఇదే తొలిసారని ఆర్టెగా ఆనందం వ్యక్తం చేశారు. నిగరాగువాతో ఆర్థిక సంబంధాలు పటిష్టపరచుకోవాలనుకుంటున్నట్లు పుతిన్ చెప్పారు.

Leave a Comment