‘సినిమాలకు కొన్నాళ్లు గ్యాప్ ఇస్తున్నాను’

 81389293601_625x300 ‘కరీనా కపూర్’. కొత్తదనం కోసం పరితపించడం కరీనా ప్రత్యేకత. వరుస సినిమాలతో పాటు.. తనకంటూ ఓ ప్రత్యేక ఒరవడి సృష్టించుకున్న ఆమె జోరు ఇప్పుడు కాస్త తగ్గింది. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ ను పెళ్లి చేసుకున్న ఆమె.. కొంతకాలం సినిమాలకు గ్యాప్ ఇస్తానంటోంది. కుటంబానికే తన తొలి ప్రాధాన్యత అంటోంది. ప్రస్తుతం సినిమాలు చేసే ఆలోచన లేదని.. దానికి మరికొంత కాలం ఆగాల్సిందేనంటూ తేల్చి చెప్పింది. ఆ క్రమంలోనే ‘జోయా అక్తర్’ సినిమాను కూడా తిరస్కరించింది.
 
‘నేను కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నాను. సినిమాలకు కొన్ని రోజులు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నాను. ఇంకా మూడు-నాలుగు నెలల తరువాత సినిమాల గురించి ఆలోచిస్తాను’ అంటూ మీడియాకు తెలిపింది. తగిన సమయంలో తిరిగి వెండితెరపై కనిపిస్తానంటోంది. ‘దిల్ దడక్నే’చిత్రానికి కరీనాకు తొలుత అవకాశం వచ్చినా.. ఆ అవకాశాన్ని కాదనడంతో అది కాస్తా అనుష్క శర్మ చేతుల్లోకి వెళ్లింది.

Leave a Comment