రైల్వే స్టేషన్ లో అమితాబ్ తప్పిపోయాడట!

Amitabh Bachchanఅవునండి.. బిగ్ బీ అమితాబ్ ఓసారి కిక్కిరిసిన రైల్వే స్టేషన్ లో తప్పిపోయారట. అప్పుడు అమితాబ్ వయస్సు ఎనిమిదేళ్లు.  స్వయంగా బిగ్ బీ తన బ్లాగ్ లో వెల్లడించారు. తాత, అమ్మమ్మలను చూడటానికి తన తల్లి తండ్రులు ప్రముఖ కవి హరివంశ రాయ్ బచన్, తేజీ బచ్చన్ లతో కలిసి అలహాబాద్ నుంచి కరాచీకి వెళుతుండగా ఈ ఘటన జరిగిందన్నారు.
రెండు రోజుల ప్రయాణంలో ఒక రైలు నుంచి మరో రైలు మారాల్సి ఉండేది. ప్రయాణీకులు కిక్కిరిసి ఉన్న కారణంగా తాను తప్పిపోయాను. తాను తప్పిపోయిన అనే విషయం తన తల్లి గ్రహించి.. తన తండ్రికి చెప్పిందని..ఆతర్వాత తన తల్లి తండ్రులిద్దరూ ఆందోళనతో రైల్వే స్టేషన్ అంతా వెతికారని అమితాబ్ తెలిపారు.
చాలాసేపు వెతికిన తర్వాత ఓ వ్యక్తి వచ్చి ఓ బాలుడు అక్కడ ఉన్నాడని తన తల్లితండ్రులకు తెలియ చేయడంతో కథ సుఖాంతమైందని అమితాబ్ తన బ్లాగ్ లో పోస్ట్ చేశారు. తనకు రైళు ప్రయాణమంటే చాలా ఇష్టమని తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా రైలును చూసే ఓ ఫోటోను కూడా పోస్ట్ చేశారు.

Leave a Comment