ఒక్కసారిగా ఆందోళన చెందా: ప్రణబ్ ముఖర్జీ

pranab mukherjeeన్యూఢిల్లీ : తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. సంఘటన విషయం తెలియగానే ఆయన శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పేలుడు వల్ల పది అడుగుల గొయ్యి పడిందని తెలిసి ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం బాధిత కుటుంబాల వెంట ఉండాలని ఆయన తెలిపారు. ఇంత పెద్దప్రమాదం జరిగిందన్న విషయం తెలియగానే తాను ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యానని, క్షతగాత్రులకు వైద్యసేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా పాల్గొంటుందని ఆశిస్తున్నానని ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు.

Leave a Comment